బహ్రెయిన్:కుమారుడి మృతదేహం రాకముందే తల్లి మృతి
- May 31, 2018
బహ్రెయిన్:బహ్రెయిన్‌లో 30 ఏళ్ళుగా నివసిస్తూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సుకు నడరాజన్ (50) ఇటీవల మరణించగా, అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆమె తల్లి మృతి చెందడం అందర్నీ కలచివేసింది. తీవ్రమైన గుండెపోటుతో సుకు తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మే 15న తీవ్ర అనారోగ్యంతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో సుకు నడరాజన్ ప్రాణాలు యకోల్పోయారు. బహ్రెయిన్‌లో సోషల్ వర్కర్స్ సుకు మృతదేహాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బహ్రెయిన్ నుంచి ఇండియాలోని ఎయిర్‌పోర్ట్‌కి సుకు మృతదేహం చేరుకోవడానికి ముందే అతని తల్లి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మీద బెంగతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







