ఉమ్రా ఫిలిగ్రిమ్స్ ఓవర్‌స్టేయింగ్: 6 నెలల జైలు, 50,000 సౌదీ రియాల్స్ జరీమానా
- May 31, 2018
రియాద్:ఉమ్రా ఫిలిగ్రిమ్స్, తమ ఎంట్రీ వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా కింగ్‌డమ్‌లోనే వుండిపోతే, అలాంటివారికి 50,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ హెచ్చరించింది. ఉమ్రా యాత్రీకులు, తమ ట్రావెల్ షెడ్యూల్‌ని పక్కాగా ఫాలో అవ్వాలని, వీసా గడువు ముగియకముందే దేశం విడిచి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్రా వీసాలతో వచ్చేవారికి మక్కా, జెడ్డా మరియు మదీనా బయటి ప్రాంతాల్లో తిరిగేందుకు అవకాశం లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) స్పష్టం చేసింది. ఉమ్రా వీసాలపై వచ్చేవారికి అక్రమంగా ఆశ్రయం కల్పించడం నేరమని తమ పౌరులకూ జవజాత్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 2017లో 19,079,306 మంది యాత్రీకులు ఉమ్రా పూర్తి చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







