సల్మాన్‌ఖాన్‌ని కొట్టండి.. రూ.2 లక్షలు పట్టుకెళ్లండి

సల్మాన్‌ఖాన్‌ని కొట్టండి.. రూ.2 లక్షలు పట్టుకెళ్లండి

బాలీవుడ్ హీరో సల్మాన్‌ను నడిరోడ్డుపై కొట్టండి. రెండు లక్షలు పట్టుకెళ్లండి అంటూ సంచలన ప్రకటన చేశారు గోవింద్ పరాషర్. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సల్మాన్ ఖాన్ సినిమా తీశాడని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొత్త సంస్థ హిందూ హై ఆజ్ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఆరోపించారు. అక్టోబర్‌లో విడుదల కానున్న లవరాత్రి పేరిట తీసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాను అడ్డుకోపోతే హిందూ కార్యకర్తలతో కలిసి థియేటర్లను ధహనం చేస్తామని హెచ్చరించారు. గోవింద్ ఇటీవల అయోధ్యలో రాముడి దేవాలయ్యాన్ని నిర్మించాలని కోరుతూ మూడు రోజుల పాటు సంతకాల సేకరణ ఉద్యమం కూడా చేపట్టారు. 

Back to Top