'ముద్ర' సినిమా ఫస్ట్ లుక్ విడుదల
- June 01, 2018
కెరీర్‌లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వెళుతున్న యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది కిరాక్ పార్టీ అనే రీమేక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు నిఖిల్. ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి సారించాడు. ప్రస్తుతం తమిళ్‌లో విజయం సాధించిన కనితన్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
నిఖిల్ 16వ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ముద్ర అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్, ఎల్ఎల్‌పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







