నార్కెల్‌ కాంచా-లొంకా దియా ముర్గిర్‌

- June 01, 2018 , by Maagulf
నార్కెల్‌ కాంచా-లొంకా దియా ముర్గిర్‌

కావాల్సిన పదార్థాలు
చికెన్‌ లెగ్‌ (బోన్‌లెస్‌) - 150గ్రాములు, ఉల్లిపాయ (తరిగి) - 50గ్రాములు, అల్లం వెల్లుల్లి గుజ్జు - ఎనిమిది గ్రాములు, కొబ్బరి తురుము - 50గ్రాములు, పచ్చిమిర్చి ముద్ద- ఐదు గ్రాములు, కొత్తిమీర ముద్ద - 15గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - రెండు గ్రాములు, కారం - మూడు గ్రాములు, వేగించిన జీలకర్రపొడి - ఐదు గ్రాములు, ఆవ నూనె - 20మిల్లీలీటర్లు, జీలకర్ర ముద్ద, ధనియాల ముద్ద - ఒక్కోటి ఐదు గ్రాముల చొప్పున, పెరుగు - 15గ్రాములు.
 
 
తయారీ విధానం:
 
చికెన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
ఒక పాత్రలో ఆవ నూనె వేసి చికెన్‌ వేసి కాసేపు వేగించి ఉప్పు వేసి మరికాసేపు వేగించి పక్కనపెఎ ట్టాలి.
పాన్‌లో నూనె వేసి ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
అల్లంవెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తాజా కొబ్బరి గుజ్జులతో పాటు ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కారం, కొత్తిమీర ముద్ద, పెరుగు, నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి.
తరువాత ఇందులో చికెన్‌ వేసి పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
ఆఖర్న వేగించిన జీలకర్రపొడి వేసి స్టవ్‌ మీద నుంచి పాన్‌ దింపేయాలి. గరమ్‌ గరమ్‌గా తింటే యమ్మీగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com