‘నవాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన హీరో శింబు
- June 02, 2018
ఇటీవల కాలం ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం నవాబ్ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేశారు శింబు. శింబు షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని, అనుకున్న సమయానికి సినిమా పూర్తికాదన్న అపవాదు ఉంది. అయితే అలాంటి రూమర్స్‌కు చెక్ పెడుతూ శింబు కూడా తన పోర్షన్ అనుకున్న సమయానికే పూర్తి చేశారు.
ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







