యు.ఏ.ఈ లోని అబుధాబి లో ఘనంగా 'తెలంగాణ అవతరణ దినోత్సవ' వేడుకలు

- June 02, 2018 , by Maagulf

అబుధాబి:తెలంగాణా రాష్ట్రం అవతరించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యిన సందర్బంగా యూ ఏ ఈ లో ఉంటున్న తెలంగాణా ప్రాంత వాసులందరుఅబూ ధాబీ లోని తెలంగాణా సంఘం ఆధ్వర్యం లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు.  యు ఏ ఈ లో ఈమాసం పవిత్ర రంజాన్ మాసం కావడం చే అక్కడి ప్రభుత్వం ఎటువంటి వినోద కార్యక్రమాలు అంటే ఆట పాటలు జరుప రాదని నిర్దేశించడం తో తెలంగాణా నుండి  కళాకారులను పిలవకుండా అక్కడే నివసిస్తున్న తెలంగానీయుల సమక్షం లో సంఘ సభ్యుడి ప్రైవేట్ గెస్ట్ హౌస్  లో ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది తెలంగాణా ప్రాంత కుటుంబాల సమక్షం లో అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణా తల్లి కి దీప ప్రజ్వలన చేసి తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి ప్రారంబించారు.  చిన్నారి సంజన పాడిన ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం తెలియ జేసే  పాట తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్టర్ కవీష్ పాడిన జయహే తెలంగాణా పాట ఒక్క సారిగా వాతావరణాన్ని వేడి పుట్టించాడుఅనే గీతం తో ఒక్క సారి గా వాతావరణాన్ని వేడెక్కించాడు.  సంకల్ప్ మరియు సంస్కృతి హైదరాబాద్ చారిత్రక ప్రాశస్త్యం పై పాడిన పాట అందరినీ అలరించింది. తదనంతరం మరెన్నో తెలంగాణా భావ జాలం ఉన్నగీతాలను చిన్నారులు పాడి కార్యక్రమానికి వచ్చిన వారిని అలరింపజేశారు.  సంఘ సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి జయహే జయహే తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికిముగింపు పలికారు.  చివరగా సంఘ ప్రతినిధులు వంశీ, కమలాకర్, రాజా శ్రీనివాస్,  సదానంద్, గంగా రెడ్డి, గోపి, పల్లవి,  పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులుమాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణం లో గల్ఫ్ లో ఉంటున్న తెలంగానీయుల పాత్ర ఎంత గానో ఉన్నదని సభకు తెలియ జేస్తూ, ఆ దిశలోసంఘ తరుపున చేస్తున్న వివిధ కార్యక్రమాలు సభికులకు తెలియజేశారు. తెలంగాణా జాతి పిత సిద్దాంత కర్త అయిన ఆచార్య జయశంకర్ గారి పాత్ర తెలంగాణా రాష్ట్ర అవతరణ లో ఎంతో ఉందని సభికులు అభిప్రాయ పడ్డారు మరియు వారి ఆత్మ శాంతి కై రెండు నిమిషాలు మౌనం పాటించారు . తమ ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకుబహుమతి ప్రధానం చేసినారు .  చివరగా తెలంగాణా విందు భోజనం తో సభను ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com