ఖతర్ లో ఘనంగా 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు

- June 02, 2018 , by Maagulf
ఖతర్ లో ఘనంగా 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ' వేడుకలు

దోహా: టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల నేతృత్వంలో తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా 26కు పైగా దేశాల్లో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా ఖతర్ రాజధాని దోహాలో రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఖతర్ నాయకులు శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్ఆర్ఐలు ఉద్యమ సమయంలో ఎలాగైతే కీలక పాత్ర పోషించారో అలాగే బంగారు తెలంగాణ నిర్మాణంలో సైతం పాలు పంచుకుంటామన్నారు. శోభన్ బందారపు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కొరకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రమే అని కాకుండా దేశ ప్రజల స్థితిగతులను మార్చేందుకు, వారి శ్రేయస్సుకు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా నాంది పలికారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పని చేసి దేశ ప్రగతికి తోడ్పడుతామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ లో ఉన్న తెలంగాణవాసుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. దానికి నిదర్శనమే ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా బడ్జెట్ లో రూ. వంద కోట్లు కేటాయించి, రూ.

50 కోట్లు తక్షణం అందుబాటులోకి తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికులు ఎవరు అధైర్యపడి ఆత్మహత్య లు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖతర్ నాయకులు నర్సయ్య డోనికేని, ప్రమోద్ కేతే, శంకర్ సుందరగిరి, మహేందర్ చింతకుంట, ఇతర నాయకులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com