వాల్‌నట్స్ తీసుకుంటే మగవారికి మంచిది...

- June 02, 2018 , by Maagulf
వాల్‌నట్స్ తీసుకుంటే మగవారికి మంచిది...

గింజలు తినడం వలన పలు అనారోగ్యాలు దూరమవుతాయి. శరీరానికి కావలసిన కీలక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. నట్స్‌ను 10 గ్రాముల మోతాదులో తినడం వలన ఒక రోజుకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అయితే ఒకే రకమైన నట్స్‌ను కాకుండా 3, 4 రకాలను 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. 

వాల్‌నట్స్ రోజు తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీంతో గుండె వ్యాధులు దూరమవుతాయి. అదేవిధంగా ఎముకలు దృఢత్వం పొందుతాయి. శరీర మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. డయోబెటిస్ ఉంటే అదుపులోకి వస్తుంది. గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. మగవారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆడవారిలో రుతు సమస్యలు తొలగిపోతాయి. 
 
బాదం పప్పు తినడం వల్ల శరీరరోగనిరోధక శక్తి పెరుగుతుంది. పలురకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. పురుషుల్లో ఉండే వ్యంధ్యత్వ సమస్యలు పోతాయి. సంతానం కలిగేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. తక్కువ మెుత్తంలో తిన్నా కడుపు ఫుల్‌గా ఉంటుంది.
 
వేరుశెనగలు నిత్యం పలు వంటకాల్లోనూ, చట్నీల్లోనూ వాడుతుంటారు. వీటిని నట్స్ రూపంలో రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఇ ఉండడం వలన శరీరానికి సామర్థ్యం పెరుగుతుంది.
 
పిస్తా ప‌ప్పును గుండె సమ‌స్య‌లు రావు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. పొడి చ‌ర్మం ఉన్న‌వారు తింటే వారి చ‌ర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శ‌రీరరోగనిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌మ‌వుతుంది. డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.
 
జీడిప‌ప్పును రోజు తినడం వలన శరీరానికి చాలా మంచిది. దీని వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ వృద్ధి చెందుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. శ‌రీరరోగనిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. కంటి స‌మ‌స్య‌లు రావు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com