బహ్రెయిన్:ఖలీఫా టౌన్‌లో హౌసింగ్ యూనిట్స్ డిస్ట్రిబ్యూషన్
- June 08, 2018
బహ్రెయిన్:ఖలీఫా టౌన్ ప్రాజెక్ట్‌లో హౌసింగ్ యూనిట్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నట్లు హౌసింగ్ మినిస్ట్రీ పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచనల మేరకు 5,000 హౌసింగ్ యూనిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో ఈ పంపకం చేపట్టాలని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశించారు. ఈ విషయాన్ని హౌసింగ్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఖలీఫా చెప్పారు. లబ్దిదారులు, హౌసింగ్ యూనిట్స్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖలీఫా టౌన్ పూర్తి స్థాయిలో పూర్తయ్యాక 54,000 మందికి అకామడేట్ చేయగలుగుతుంది. మొత్తం 6,000 హౌసింగ్ యూనిట్స్ ఈ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 400 యూనిట్స్ పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







