దావూద్ రెస్టారెంట్ రూ.4.28కోట్లు..!
- December 09, 2015
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులకు ఈ రోజు ముంబయిలో వేలం నిర్వహించారు. ముంబయిలో దావూద్‌కు చెందిన రెస్టారెంట్‌ను మాజీ జర్నలిస్టు ఎస్.బాలకృష్ణన్ రూ.4.28కోట్లకు కొనుక్కున్నారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దశాబ్దం క్రితమే ముంబయిలో అనేక కోట్ల విలువ చేసే ఆస్తులను వదిలేసి పారిపోయాడు.ఇప్పటికే కొన్ని ఆస్తులను వేలం వేయగా మరికొన్ని మిగిలి ఉన్నాయి. దావూద్ ఉపయోగించిన గ్రీన్ హ్యుందాయ్ ఎసెంట్ సెడాన్ కారును కూడా వేలంలో ఉంచారు. ఆ కారు ధరను కేవలం రూ.4వేలుగా నిర్ణయించారు. దావూద్ భయంతో చాలా మంది కొనడానికి ముందుకు రావడం లేదు. ఈరోజు వేలంలో రెస్టారెంట్‌ను కొనుగోలు చేసిన బాలకృష్ణన్ ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను మార్చేసి పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ సెంటర్ నడపడానికి దీనిని కొన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







