అల్లా ఆశీస్సుల కోసం 4 ఏళ్ల చిన్నారిని చంపిన తండ్రి ...
- June 10, 2018
స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే చాలు దేవుడు సంతృప్తి చెందుతాడు. బరువైన కానుకల్ని, బలిదానాలను కోరుకోడు. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాల వెంట పరిగెడుతూ దేవుడికి మొక్కుల పేరుతో బలి ఇస్తున్నారు. జంతువులను బలి ఇవ్వడం ఒక ఎత్తైతే, మనుషుల్ని అందునా పసి బిడ్డల్ని అన్యాయంగా బలి చేస్తున్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన రంజాన్ మాసపు రోజులు చాలా కీలకం. అత్యంత నిష్టగా రోజాని ఆచరిస్తూ భక్తి శ్రద్దలతో అల్లాని ప్రార్థిస్తారు. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పిపార్సిటీ పట్టణానికి చెందిన నవాబ్ అలీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం జూన్ 7 రాత్రి కుటుంబసభ్యులంతా మేడపైన నిద్రిస్తున్నారు. ఉదయం లేచే సరికి పెద్ద కుమార్తె 4 ఏళ్ల రిజ్వానా కనిపించలేదు. అమ్మ లేపితే గాని లెగని బిడ్డ ఎక్కడి వెళ్లిందా అని కంగారు పడ్డ తల్లి కిందికి వెళ్లి చూసింది. పెరట్లో నిర్జీవంగా పడి ఉన్న రిజ్వానాను చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. భోరున విలపిస్తూ భర్తకు వచ్చి చెప్పింది. అయ్యో.. అని బాధపడుతున్నాడే కానీ కొంత తడబాటు కనిపించి అతడిలో.
చుట్టు పక్కల స్థానికులకూ అతడిపైనే అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అలీని విచారించగా అసలు విషయం బయటపడింది. గురువారం ఉదయం రిజ్వానాను అలీ బయటకు తీసుకువెళ్లి పాప అడిగిన వన్నీ కొని ఇచ్చాడు. అర్థరాత్రి దాటాక పాపను కిందకు తీసుకువచ్చి ఒడిలో కూర్చోబెట్టకున్నాడు. ఖురాన్ చదివి అల్లాను ప్రార్థిస్తూ ఒడిలో ఉన్న బిడ్డ మెడను కత్తితో కోసి చంపేసాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మేడపైకి వెళ్లి పడుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. పోలీసులు పాపను అత్యంత దారుణంగా హత్య చేసినందుకుగాను అలీని అరెస్టు చేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







