విడుదల అయిన కళ్యాణ్ దేవ్ 'విజేత' టీజర్.!
- June 11, 2018
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు గా కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ మూవీ కాథతో ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. తల్లిలేని బిడ్డగా చిన్నప్పటి నుండి తాను ఏది అడిగితే అది ముందే తెచ్చి ఇచ్చే తండ్రిగా మురళి శర్మ కనిపిస్తున్నాడు. డిగ్రీ పూర్తయినా జాబ్ రాక ఆవారాగా తిరిగే హీరో.
ఈ నేపథ్యంలో అతను గొడవల్లో ఇరుక్కోవడం తండ్రి వాటిని తెలుసుకుని బాధపడటం. ఇంతలో హీరో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడటం. విజేత టీజర్ చూస్తే ఇంప్రెసివ్ గానే ఉంది. కళ్యాణ్ దేవ్ లుక్స్ బాగున్నాయి. కచ్చితంగా ఇతను కూడా మెగా హీరోల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటాడని అనిపిస్తుంది.
ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ. రాజమౌళి సినిమాలు తప్ప మిగతా సినిమాలు చేయని సెంథిల్ కుమార్ చాలా కాలం తర్వాత చేస్తున్న బయట సినిమా ఇది. మరి ఈ విజేత అందరిని మెప్పిస్తాడా లేడా అన్నది చూడాలి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!