తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును జపాన్...
- December 10, 2015
చైనాను వెనక్కి నెట్టి మరీ భారత్ లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును జపాన్ చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టుపై చైనా భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ భారత్ జపాన్ టెక్నాలజీకే మొగ్గు చూపింది. ఈ మేరకు బుధవారం క్యాబినెట్ 98,000 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జపాన్ ప్రధాని షిజో అబే భారత పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉంది. షింజో అబే శుక్రవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు రానున్నారు. చైనా ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపినప్పటికీ.. డిజైన్ , మేనేజ్ మెంట్ లోపాలతో పాటు, గతంలో చైనాలోని వెన్ జూ నగరంలో జరిగిన బుల్లెట్ రైలు ప్రమాదంలో 40 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల మూలంగా భారత్.. చైనాపై ఆసక్తి చూపించనట్లు తెలుస్తోంది. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు జపాన్ కు దక్కడంపై.. ఈ కాంట్రాక్టు చిన్న అంశమే అని పేర్కొంది. భారత్ లో పెట్టుబడులకు చైనాకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అరవింద్ పనగాడియా నేతృత్వంలోని కమిటీ జపాన్ రైల్వే 'షీన్ కన్ సేన్ సిస్టమ్' అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, సమయపాలన పాటిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుమూలంగా ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







