బహ్రెయిన్:హత్యా నేరాన్ని అంగీకరించిన బహ్రెయినీ
- June 14, 2018
బహ్రెయిన్:దొంగతనం చేసే క్రమంలో ఇద్దర్ని హత్య చేసినట్లు బహ్రెయినీ నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఈ క్రమంలో నిందితుడి నుంచి ఎలాంటి పశ్చాత్తాపం కన్పించలేదు. తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణ కోసం ఎన్నో పనులు చేశాననీ, అవేవీ తనకు తగినంత సంపాదనను ఇవ్వలేకపోయాయనీ, దాంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాననీ, ఈ క్రమంలోనే ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఫిబ్రవరిలో నిందితుడు తన తొలి నేరానికి పాల్పడ్డాడు. ఆసియా క్లీనర్‌ని దోపిడీ చేసిన నిందితుడు, అతనిపై దాడి చేయలేదు. ఆ ఘటనలో నిందితుడికి కేవలం 16 బహ్రెయినీ దినార్స్ మాత్రమే లభించాయి. నిందితుడు మార్చి 28న తొలి హత్య చేశాడు. సుత్తితో ఓ లేబరర్ని హతమార్చి, అతని పర్స్ నుంచి 25 బహ్రెయినీ దినార్స్ దొంగిలించాడు. ఏప్రిల్ 13న నిందితుడు మరో హత్య చేశాడు. అయితే ఆ ఘటనలో అతనికి ఎలాంటి ధనం లభించలేదు. ఈ ఘటనలోనూ నిందితుడు, సుత్తినే హత్యకు వినియోగించాడు. ఈ ఘటనలో తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







