మాస్కో:ఫుట్బాల్ అభిమానులపైకి దూసుకెళ్లిన కారు
- June 17, 2018
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో ఫుట్బాల్ అభిమానుల మీదికి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. వీళ్లలో మెక్సికో టీమ్ అభిమానులు కూడా ఉన్నారు. వీళ్లంతా సాకర్ వరల్డ్కప్ కోసమే రష్యా వచ్చారు. కిర్గిస్థాన్ లైసెన్స్ ఉన్న ఆ ముస్లిం డ్రైవర్ సోవియట్ రిపబ్లిక్ మాజీ పౌరుడు. అయితే తాను కావాలని జనంపైకి కారును తీసుకెళ్లలేదని అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మెక్సికన్ జెర్సీలు ధరించిన అభిమానులపైకి ఈ కారు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం రోజు జర్మనీతో తమ తొలి మ్యాచ్లో మెక్సికో తలపడబోతున్నది. లుజ్నికి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ చూడటానికే వేల మంది మెక్సికో అభిమానులు మాస్కో వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. అక్కడున్నవాళ్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అది నేను కాదు అని ఆ డ్రైవర్ అరచినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ సమయంలో అతను మద్యం తాగినట్లు కనిపించలేదని అన్నాడు.
గాయపడిన వాళ్లంతా కోలుకుంటున్నారని, ఎవరికీ అంత తీవ్రమైన గాయాలు కాలేదని ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటన తర్వాత భద్రతను మరింత పెంచారు.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







