ఐఫా-2018 విజేతల లిస్ట్
- June 24, 2018
ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్(ఐఫా) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్యాంకాక్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు అతిరధ మహారధులు హాజరై , ఈ కార్యక్రమాన్ని రంజిపచేసారు. కరణ్‌జోహార్, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఈ కార్య క్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. దివంగత నటి శ్రీదేవి 'మామ్' చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్ ఈ అవార్డును అందుకొని , స్టేజ్ ఫై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
అలాగే 'హిందీ మీడియమ్' సినిమాకు గాను బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ప్రస్తుతం ఇర్ఫాన్ అనారోగ్యంతో లండన్‌లో చికిత్స తీసుకుంటుండంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటులు శ్రీదేవి, వినోద్ ఖన్నా, శశికపూర్‌కు ఐఫా ఘనంగా నివాళులు అర్పించింది.
ఇక 2018 ఐఫా విజేతల లిస్ట్ ఈ విధంగా ఉంది..
ఉత్తమ చిత్రం : తుమ్హారి సులు
ఉత్తమ నటుడు : ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం)
ఉత్తమ నటి : శ్రీదేవి(మామ్)
ఔట్‌స్టాండింగ్ అచివ్మెంట్ అవార్డు : అనుపమ్ ఖేర్
ఉత్తమ దర్శకుడు : సాకేత్ చౌదరి(హిందీ మీడియం)
ఉత్తమ కథ : న్యూటన్
ఉత్తమ సహాయ నటుడు : నవాజుద్దీన్ సిద్దిఖీ(మామ్)
ఉత్తమ సహాయన నటి : మెహర్ విజ్ (సీక్రెట్ సూపర్ స్టార్)
ఉత్తమ సంగీత దర్శకుడు :అమాల్మాలిక్, తనిష్క్ బగ్చీ, అఖిల సచ్దేవ(బద్రీనాథ్‌కి దుల్హనియా)
ఉత్తమ గాయని :మెఘనా మిశ్రా(జగ్గా జాసూస్)
ఉత్తమ గాయకుడు : అర్జిత్ సింగ్ (జబ్ హ్యారీ మెట్ సెజల్)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







