హింసాత్మక దాడులతో అల్లకల్లోలం సృష్టించాలంటూ..

- June 25, 2018 , by Maagulf
హింసాత్మక దాడులతో అల్లకల్లోలం సృష్టించాలంటూ..

ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్ మరోసారి భారత్‌పై బహిరంగంగా విషం కక్కాడు... హింసాత్మక దాడులతో కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ ముష్కరమూకలకు పిలుపునిచ్చాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త శకం ప్రారంభమైందని.. దేవుడి దయతో కాశ్మీర్‌ స్వతంత్ర దేశంగా అవతరించనుందన్నారు.

కశ్మీర్‌లో రక్తం పారుతోందని,  దేవుడు చూస్తున్నాడని, ఆయన త్వరలోనే తీర్పు చెబుతాడన్నాడు. ఎందుకంటే నిర్ణయాలన్నీ పైనుంచే వస్తాయని.. వాషింగ్టన్‌ నుంచి కాదన్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం రావడం ప్రపంచం కళ్లారా చూస్తుందని… భారత భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నవాళ్లను ‘అల్లా’ చూస్తున్నాడు పేర్కొన్నాడు. వాళ్లు చనిపోతూ కూడా పాకిస్తాన్‌, కశ్మీర్‌ ఐక్యత గురించి మాట్లాడుతున్నారని... కశ్మీర్‌లో ఇది నూతన శకమని... మోదీ దానిని అడ్డుకోలేరంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.కశ్మీర్లో జరిగే అనేక ఉగ్రదాడుల వెనక లష్కరేతొయిబా హస్తం ఉంది. అలాగే స్థానిక యువతను భద్రతా సిబ్బంది మీద రాళ్లు విసిరేలా అది ప్రోత్సహిస్తోంది. పాకిస్థాన్‌ ఇంటిలిజెన్స్ సర్వీస్‌తో దీనికి సంబంధాలున్నాయి. జామత్ ఉద్ దవా పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలుపొంది పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీలో పాగా వేయాలని భావిస్తున్నాడు సయీద్‌. అతడి కుమారుడు, అల్లుడితో కలిపి మొత్తం 265 సీట్లలో అతడి పార్టీ పోటీ చేస్తోంది. జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com