భారత్ దేశవ్యాప్తంగా ఏటీఎమ్ ల భద్రతపై ఆర్బిఐ ఆందోళన
- June 26, 2018
సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకో సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులోకి వస్తోంది. అందుకు తగ్గట్లే... వైరస్లు, మాల్వేర్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్ల కిందటి పాతబడిన సాఫ్ట్వేర్ వాడుతున్న ATM లు ఎంతవరకు సురక్షితం. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకే చెమటలు పట్టిస్తున్న హ్యాకర్లు.. నిన్నటితరం సాఫ్ట్వేర్ను వదులుతారా..? ఇదే సందేహం వచ్చింది RBI కి. అందుకే దేశవ్యాప్తంగా బ్యాంకులన్నింటికీ హెచ్చరికలు పంపింది. ఏడాదిలోగా అన్ని ATM లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలాది ATM లలో విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారు. పదేళ్ల కిందటి ఈ OS కు మైక్రోసాఫ్ట్ కంపెనీ సపోర్ట్ కూడా నిలిపేసింది. అంటే ఏ సమస్య వచ్చినా... మిషన్ పని గోవిందా అన్న మాట. అంతేకాదు.. ఇప్పటికే దీనికి అనేక మాల్వేర్లు పుట్టుకొచ్చాయి. కార్డు ఇన్సర్ట్ చేయకుండా మనీ విత్డ్రా చేసేలా ప్రోగ్రాంలు తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో 2019 మార్చి నాటికి అన్ని ATM ల ఆపరేటింగ్ సిస్టం మార్చేయాడంతో పాటు.. యాంటీ స్కిమ్మింగ్ ఏర్పాట్లు చేయాలంది. అలాగే 2018 ఆగస్టు నాటికి కొత్త BIOS పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని... మిషన్లకు ఉండే USB పోర్టులు డిసేబుల్ చేయాలని... ఆటోరన్ ఆప్షన్ పనిచేయకుండా చేయాలని. తాజా సెక్యూరిటీ ప్యాచ్లు అప్లై చేయాలని... RBI ఆదేశాలిచ్చింది. లేదంటే ఎదురయ్యే పరిణామాలను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది...
RBI చేసిన సూచనలను నిపుణులు స్వాగతిస్తున్నారు. ATM లలో ఇలాంటి సమస్యలున్నట్లు చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నా బ్యాంకులు స్పందించడం లేదని.. దీనివల్ల ఇప్పటికే అనేక మోసాలు జరిగాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకులు ఈ చర్యలు చేపట్టకపోతే... ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







