ఆరుగురికి 'సుల్తాన్' కల్చరల్ అవార్డ్స్
- December 11, 2015
14వ సుల్తాన్ బిన్ అల్ ఒవైస్ కల్చరల్ అవార్డులను ఈ సంవత్సరం ఆరుగురికి అందించనున్నారు. సుల్తాన్ బిన్ అలీ అల్ ఒవైస్ కల్చరల్ ఫౌండేషన్, ఎమిరేట్ కవి సుల్తాన్ బిన్ అలీ అల్ ఒవైస్ పేరు మీద ఈ అవార్డుల్ని ప్రతి యేటా అందిస్తోంది. అరబ్ స్కాలర్స్, లిటరేచర్స్ మరియు ఇంటలెక్చువల్స్‌కి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ అబు అల్లా అల్ మొతావా మాట్లాడుతూ, న్యాయ నిర్ణేతలు 1,575 మంది అభ్యర్థుల నుంచి ఆరుగుర్ని విజేతలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. పోయెట్రీ ప్రైజ్ విభాగంలో హబీబ్ అల్ సయేగ్ అవార్డును అందుకోనున్నారు. యూసుల్ అల్ అకీద్ మరియు ఇస్మాయిల్ ఫహాద్ ఇస్మాయిల్ షార్ట్ స్టోరీ, నవల్ మరియు డ్రామా కేటగిరీలో అవార్డుకు ఎంపికయ్యారు. లిటరేచర్ స్టడీస్ క్రిటిసిజమ్ కేటగిరీలో సలాహ్ ఫదీల్ మరియు కమల్ అబు అదీబ్ అవార్డును అందుకోనుండగా, హుమానిటేరియన్ మరియు ఫ్యూచర్ స్టడీస్ విభాగంలో రష్దీ రషీద్ అవార్డును అందుకుంటారు. మార్చ్‌లో ఈ అవార్డులను బహుకరించే కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







