డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో..!
- December 11, 2015
మీకు రెగ్యులర్ గా చాక్లెట్ తినే అలవాటు ఉందా ? అయితే డోంట్ వర్రీ.. మీరు చాలా ప్రయోజనాలే పొందుతున్నారు. చాక్లెట్ రుచినే కాదండోయే.. ఆరోగ్యాన్నికూడా అందిస్తుంది. చాక్లెట్ తీసుకోవడం వల్ల ఇందులో కూడా పాలిఫెనాల్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో..! నోట్లో వేసుకుంటే కరిగిపోయే గుణం ఉన్న చాక్లెట్స్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ప్రీతికరమే. చూడగానే అందరినీ మెల్ట్ అయ్యేలా చేసే చాక్లెట్స్ వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాదు రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తాయి. రోజూ చిన్న చాక్లెట్ బార్‌ను తినడం ఆరోగ్యకరం అని చెప్పడానికి 8 కారణాలున్నాయి. చాలామంది చాకొలెట్స్ ఎక్కువ తినకూడదూ అని సూచిస్తుంటారు. కానీ చాకొలెట్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలిస్తే.. తినడం మొదలు పెట్టేస్తారు. చాకొలెట్స్ లో ఉండే కొకో ఉత్పత్తులు రక్తపోటు తగ్గించడానికి సహాయపడతాయి. చాకొలెట్ లో ఉండే ఫ్లేవర్స్, కొకో తెలివి తేటలు మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే హైపర్ టెన్షన్ ని తగ్గిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాకొలెట్ డ్రింక్స్ తీసుకున్న వాళ్ల మెంటల్ పర్ఫామెన్స్ ఎనిమిది వారాల్లో పెరిగిపోయిందట. చాకొలెట్స్ తినడం వల్ల చర్మం చెడిపోతుందని, మొటిమలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా.. చిన్న చిన్న ముక్కలుగా చాకొలెట్స్ తినడం వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. కొన్ని పీస్ ల చాకొలెట్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. అలాగే.. చాకొలెట్స్ తినేవాళ్లలో స్ర్టోక్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. చాకొలెట్స్ ఎముకలకు చాలా మంచిది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు. చిన్న చిన్న ముక్కలుగా.. కొంచెం కొంచెం చాకొలెట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. చాకొలెట్స్ తినడం వల్ల స్త్రీలకు మంచిది. ఎందుకంటే ఆడవాళ్లలో కనిపించే ప్రీ మెనుస్ర్టియల్ సిండ్రోమ్ లక్షణాలతో పోరాడే గుణం చాకొలెట్లలో ఉంది. రెగ్యులర్ గా చాకొలెట్లు ఎవరు తింటారు వాళ్లు బరువు పెరగకుండా.. స్లిమ్ గా ఉంటారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. తక్కువ పరిమాణంలో తినాలని మాత్రం మరవకండి.
తాజా వార్తలు
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!







