ఒకే ఇంట్లో 11 మంది చనిపోవడానికి వెనుక విస్తుపోయే రహస్యం..

- July 02, 2018 , by Maagulf
ఒకే ఇంట్లో 11 మంది చనిపోవడానికి వెనుక విస్తుపోయే రహస్యం..

ఢిల్లీలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న విషయంపై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కానీ వాస్తవంగా నారాయణ్ దేవ్ కుటుంబానికి విపరీతమైన భక్తి భావం ఉంది. దీనికితోడు మూఢవిశ్వాసాలను అపారంగా నమ్ముతారు. ఇందుకు కారణం గతంలో జరిగిన ఓ సంఘటనే అని తెలుస్తోంది. 

వృత్తిరీత్యా  బురారీ కుటుంబం కలప వ్యాపారం నిర్వహించేది. పదిహేనేళ్ల కిందట ఆ ఇంటి పెద్దకు ప్రమాదవశాత్తు చెక్క మీదపడటంతో ఆయన తన మాటను కోల్పోయాడు. అయితే కొద్దిరోజులకు ఎవరో చెబితే పూజలు చేశారు. దీంతో అతనికి తిరిగి మాట వచ్చిందని గతంలో ఆ ఇంట్లో పనిచేసిన మహిళ వెల్లడించింది. అలా వారి ఇంట్లో భక్తిభావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే కొందరు స్వామీజీలతో కలిసి తాంత్రికపూజలు చేసేవారు. పైగా పునర్జన్మలను బలంగా నమ్మేవారని స్థానికులు చెబుతున్నారు. 

ఆ కుటుంబానికి తాంత్రికపూజలు అలవాటు కావడంతో కొద్ది రోజులకే పరిస్థితి శృతిమించింది. చివరకు మోక్షం  కావాలి అనే కోరికను పుట్టించింది. అందుకే దానికోసం కుటుంబమంతా కలిసి సూసైడ్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com