'సాక్ష్యం'ట్రైలర్
- July 07, 2018
టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీను 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటించిన ఏమాత్రం తడబడకుండా సీనియర్ హీరోలా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు బెల్లంకొండ శ్రీను. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు పెద్దగా హిట్ కాలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయకా మంచి హిట్ అయ్యింది. తాజాగా బెల్లంకొండ శ్రీను 'సాక్ష్యం' సినిమాలో నటిస్తున్నాడు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుక జూలై 7న గ్రాండ్గా జరిగింది.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది. శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను ఆడియో వేడుకలో విడుదల చేశారు.ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం అనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీమే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
ఫైట్లు, అయిదు ఎలిమెంట్స్ ను కలుపుతూ అయిదుగురు ఫేమస్ సింగర్స్ పాడిన పాట అంటూ ముందుగానే చెప్పేసారు. పైగా ఈ సినిమాకు 40కోట్ల ఖర్చు అని కూడా బయటకు వచ్చింది. ట్రయిలర్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఒకటి రెగ్యులర్ సినిమా లవర్స్ కోసం కమర్షియల్ పార్ట్. రెండవది, డిఫరెంట్ సినిమాలను లైక్ చేసే వారి కోసం మాంచి హెవీ థ్రిల్లింగ్ పార్ట్. ఈశ్వరా ఈ బిడ్డను బతికించు అనే టైపు డైలాగు బాహుబలిని మరోసారి గుర్తు చేసింది.ట్రయిలర్ చివరన్న కట్ చేసిన వృషభం మీద హీరో స్వారీ చేసుకుంటూ రావడం ట్రయిలర్ ను మరోమెట్టు పైకిఎక్కించి, సినిమా మీద ఆసక్తిని పెంచింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు







