ఇరాన్:టెహ్రాన్‌పై దాడి కేసులో 8 మంది ఉగ్రవాదులకు ఉరి
- July 07, 2018
టెహ్రాన్ : ఇరాన్ పార్లమెంట్ పైన, ఇరాన్ మత నాయకుడు రోహుల్లా ఖోమేనీ మసోలియంóపైన 2017లో దాడి జరిపిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపునకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను శనివారం ఉరి తీసినట్లు ఇరాన్ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఉరితీసిన విషయాన్ని అధికారిక మిజాన్ వార్త సంస్థతో పాటు ఇతర వార్తా సంస్ధలు కూడా ధ్రువీకరించాయి. కాని ఎప్పుడు ఉరితీశారన్న విషయాన్ని పేర్కొనలేదు. మరణ శిక్షలు విధించడంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఇరాన్ ఉన్నప్పటికీ ఈ విధంగా సామూహికంగా ఉరితీసిన సంఘటనలు అరుదు. అంతకుముందు 2007లో ఒకసారి సామూహిక ఉరిశిక్షలను ఇరాన్ అమలు చేసింది. మషాద్‌లో అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిని ఒకేసారి ఉరితీసింది. ఇస్లామిక్ స్టేట్ పార్లమెంట్‌పై జరిపిన దాడిలో 18 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి మరో 12 మందిపై విచారణ జరుగుతున్నది.
పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..