రోజూ కరివేపాకు ఆకులు తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా?
- July 19, 2018
మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినకుండా ప్రక్కకు నెట్టివేస్తారు. అయితే ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకు మన శరీరానికి చేసే మేలు ఎంతో వుంది. ప్రతిరోజు అయిదు కరివేపాకు ఆకులను తినడం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకుంటే... ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
2. కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది.
3. కరివేపాకులో విటమిన్ ఎ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తినడం వల్ల కళ్లకు సంబందించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
4. కరివేపాకులో ఉండే ఔషద గుణాలు వెంట్రుకలు రాలడం, పలుచబడడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
5. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటుని నివారిస్తుంది.
6. అలాగే కరివేపాకుని ఒక మంచి సౌంధర్య సాధనంగా కూడా చెప్పవచ్చు. కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, చర్మపు ఇన్ ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు వృద్దాప్య చాయలను దరిచేరనివ్వదు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







