హైదరాబాద్:కరక్కాయల కేసులో కొత్త కోణాలు
- July 19, 2018
కరక్కాయల స్కాంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంత ఎక్కువ మందితో పొడి చేయిస్తే అంత ఎక్కువ లాభాలు అంటూ ప్రచారం చేయడంతో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. బాధితులంతా పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నారు. మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకూ 5 కోట్ల రూపాయల స్కాం అన్నారు. కానీ బాధితుల సంఖ్య 600 నుంచి 700 వరకు ఉండడంతో 7 కోట్ల వరకూ స్కాం వెళ్లింది. కస్టమర్లకు ఓ ఐటీ నెంబర్ కేటాయించి, ఎక్కువ మందిని చేర్చుకోవడం ద్వారా కంపెనీ టర్నోవర్‌ను ఎంత పెంచితే లాభాలు అంతగా పెంచుకోవచ్చని, మీ కింద చేరిన సభ్యులకు లాభాల్లో వాటా ఉండదని, వాళ్లకు కేజీకి 300 చెల్లిస్తే చాలంటూ బుకాయించారు.
ఈ ఆఫర్ నచ్చడంతో బాధితులు తమకు తెలిసిన వారిని పదుల సంఖ్యలో సభ్యులుగా చేర్పించారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి తమ పూచీకత్తుపై కంపెనీలో ఒక్కో బాధితుడు 2 లక్షల నుంచి 25 లక్షల వరకు డిపాజిట్ చేయించారు. వారికి సాఫ్ట్ ఇంటర్‌గ్రేడ్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ధృవపత్రాన్ని, ఆ కంపెనీకి ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్ పేపర్ ఇచ్చి నిర్వాహకులు బురిడీ కొట్టించారు.
కరక్కాయల కంపెనీలో మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్, సంస్థ అధినేతగా చెప్పుకున్న దేవరాజ్ అనిల్‌కుమార్ స్వస్థలం నెల్లూరుగా తేలింది. వారి కోసం 2 బృందాలు గాలిస్తున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







