తెలంగాణా నిరుపేద రైతుకు... నిలువెల్లా కష్టాలు
- December 14, 2015 
వ్యవసాయంలో నిత్యం ఆటుపోట్లను ఎదుర్కొంటున్న భారతదేశ నిరుపేద రైతన్నకు కష్టాలు..కడగండ్లు సర్వసాధారణం....పీకల్లోతు కన్నీళ్ళకు తోడు...కడుపున పుట్టిన సంతానం అనారోగ్యం పాలైతే.., ఆ అభాగ్యుని రోదన వినేవారు ఎవరు ? మట్టిని నమ్ముకున్న ఆ భూమిపుత్రునికి బాసటగా నిలచేవారు ఎవరు ?
వరంగల్,తెలంగాణాకు చెందిన మధుకర్ మండాల ఒక సామాన్య రైతుగా జీవనం కొనసాగిస్తున్నాడు. తన కుమారుడైన సాయి చరణ్ ( 10 ) పుట్టుకతోనే ఎముకలలోని మూలుగ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి మధుకేర్ తన వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో వైద్యం చేయుస్తున్నప్పటికినీ , క్యాన్సర్ కణాలు ఆ బాలుడ్ని నానాటికి మరణానికి సమీపంగా చేరుస్తున్నాయే ... ఒక నెలకు తీసుకోవాల్సిన ఇమ్మునోగ్లోబ్లిన్ ఇంజక్షన్ ఖరీదు 36,600 రూపాయలు ( 590 డాలర్లు ).
గత పదేళ్లుగా ....మధుకేర్ అప్పులు చేసి , ఆస్తులు అమ్మి....తన కుమారుడి ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేయడంతో...ఆయన ఆర్ధిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింది. దీనికి తోడు అనారోగ్యం మరింత చిక్కుల్లోనికి నెట్టింది. గుందేలవిసిపోయేలా ఎదుస్తున్నాడని కాబోలు ఆ పేద రైతుకు ....గుండె సంభిందిత వ్యాధి కారణంగా ఆపరేషన్ తప్పనిసరైంది. అది సరిగా జరగకపోవడంతో మరోమారు సైతం ఆయనకు
ఆపరేషన్ జరగాల్సిఉంది.ఇంకోవైపు సాయిచరణ్ కు ఎముకలోని మూలుగ మార్పిడి ఆపరేషన్ జరిగించాలంటే, భారతదేశంలో అందుకు అయ్యే ఖర్చు 30 లక్షలు ( 60 వేల డాలర్లు ) ...బంధువులు , స్నేహితులు దయతో 10 లక్షలను ( 19 వేల డాలర్లు ) ఇప్పటివరకు సీకరించారు. కాగా , మరో 20 లక్షలు లోటు పూడకపోవడంతో ఆ కుటుంబం పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ బాలుని ఆపరేషన్ రోజు
డిసెంబర్ 29 అని వెల్లూరు సి .ఎం . సి . ఆసుపత్రి వైద్యులు నిర్ణయించడంతో...మధుకేర్ కుటుంబం తల్లడిల్లిపోతున్నారు..ఆపన్నహస్తం కోసం అలమటిస్తున్నారు. కడివెడు కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన మధుకర్ పెద్ద కుమారుడు గతంలో బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయిన విషాద ఘటన వీరి ఇంట ఉంది....మానవతావాదులు కాస్తంత స్పందించి ....ఆ అభాగ్య పేద రైతుకు ఆర్ధిక
సహాయం అందిస్తే...మిగిలిన ఒక కుమారుడిని ఐనా కాపాడుకొంటానని మధుకర్ కన్నీళ్ళతో ప్రవాస భారతీయులను వేడుకొంటున్నాడు.
మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యగలరు.
https://drive.google.com/folderview?id=0ByXPGqEjJGvTVHNvdjJiSUJvN2s&usp=sharing
దాతలు ఈ క్రింది ఎకౌంటుకి డబ్బు పంపగలరు.
Branch#Warangal
Bank#HDFC
Account no#20961010000140
Account name#Srikanth Reddy Bobbala
శ్రీకాంత్,మొబైల్ నెం#0554833715
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







