రష్యా విమానాన్ని ఐసిస్ కూల్చలేదని..
- December 14, 2015
సినాయ్‌లో కూలిన రష్యా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చలేదని ఈజిప్టు స్పష్టం చేసింది. ఉగ్రవాదుల వల్లే రష్యా విమానం కూలిందనడానికి ప్రాధమిక విచారణలో ఆధారాలు ఏమీ దొరకలేదని ఈజిప్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని ఈజిప్టు పౌర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆ విమాన దుర్ఘటనలో సుమారు 224 మంది ప్రయాణికులు మరణించారు. అయితే విమానంలో ఉగ్రవాదులు బాంబు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని రష్యా ఆరోపించింది. సాంకేతిక విచారణాధికారుల కమిటీ చేపట్టిన దర్యాప్తులో ఉగ్ర అనుమానాలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ చిక్కలేదని ఓ అధికారి తెలిపారు. రష్యా విమానాన్ని తామే కూల్చామని గతంలో ఐసిస్ కూడా ప్రకటించుకుంది
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







