ఏపీ ముఖ్యమంత్రిగా రానా
- August 04, 2018
నిమ్మకూరు : తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బయోపిక్‌ను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఆయన శనివారం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు సందర్శించారు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ, క్రిష్‌తో పాటు ఎన్టీఆర్ చిత్ర బృందం నిమ్మకూరు చేరుకుంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...ఎన్టీఆర్ బయోపిక్ ఏ ఒక్కరికో, ఏ పార్టీకో సంబంధించిందో కాదని అన్నారు. అందరికీ సంబంధించిన చిత్రమని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ చిత్రంలో తమ కుటుంబసభ్యులు కూడా ఉంటారని, అలాగే ఎన్టీఆర్‌కు సంబంధం ఉన్న అన్ని రంగాలవారూ ఈ చిత్రంలో కనిపిస్తారన్నారు.
తన తండ్రి బాల్యంతో పాటు, పలు విషయాలను నిమ్మకూరులోని తమ బంధువులు, తెలిసినవారిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. నిమ్మకూరు సందర్శించగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ గురించి అన్ని తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌తో కలిసి చేయడం సంతోషంగా ఉందన్నారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పటి నుంచి ఆయన గురించి రోజుకో చరిత్ర తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ సూర్యుడులాంటవారు అని నిమ్మకూరులో ఆయన బాల్యస్మృతుల్ని చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఖ్యాతి ఏమాత్రం తగ్గకుండా సినిమా తీయడమే తన ఏకైక లక్ష్యమని, పైనుంచి ఎన్టీఆర్ తనను దీవిస్తున్నారని అన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







