సైబీరియాలో హెలికాప్టర్ కూలి మృతిచెందిన 18 మంది
- August 04, 2018
రష్యాకు చెందిన హెలికాప్టర్ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్ ఈ రోజు ఉదయం ఆయిల్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని రష్యా రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







