ఫేక్ బ్రాండ్స్ సెల్లింగ్: 500 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేత
- August 06, 2018
దుబాయ్:డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (డిఇడి) 4879 సోషల్ మీడియా అకౌంట్స్‌ని క్లోజ్ చేసినట్లు వెల్లడించింది. ఫేక్ బ్రాండ్స్‌తో గూడ్స్ విక్రయిస్తున్నందున ఈ సోషల్ మీడియా అకౌంట్స్‌ని క్లోజ్ చేసినట్లు డిఇడి పేర్కొంది. 2018 ఫస్ట్ హాఫ్‌లో సుమారు 5000 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేసినట్లు ప్రకటించింది డిఇడి. ఈ సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఫాలో అవుతున్నవారి సంఖ్య 33.5 మిలియన్ల వరకు వుంది. డిఇడి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ డైరెక్టర్ ఇబ్రహీమ్ బెజార్డ్ మాట్లాడుతూ కౌంటర్ఫీట్ గూడ్స్‌ని విక్రయించేందుకు డీలర్స్‌కి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ ఎంతో ఉపయోగపడ్తున్నాయని చెప్పారు. ఐపీఆర్ టీమ్, టైట్ విజిల్‌తో ఈ తరహా న్యూసెన్స్‌ని అరికట్టడంలో విజయవంతమవుతోందని వివరించారు. 30 వెబ్సైట్లను కూడా క్లోజ్ చేయించామని బెహ్జార్డ్ చెప్పారు. ఇలాంటి అకౌంట్స్‌ని ఫాలో అవడం మంచిది కాదంటూ వినియోగదారులకు డిఇడి సూచించింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







