దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం
- August 08, 2018
చెన్నై:ద్రవిడ ఉద్యమ నేత.. దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజాజీ హాల్ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటల తరువాత మెరీనా బీచ్‌లో కరుణానిధి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కరుణానిధి చివరి చూపు కోసం రాజాజీ హాల్‌కు భారీగా అభిమానులు చేరుకున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను చివరి సారి దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. కొందరు అత్యూత్సాహంగా బారికేడ్లు దాటి భౌతిక కాయం దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికిపైగా గాయాలు అయ్యాయి…
కరుణానిధి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం అవ్వడం లేదు. మరోవైపు అదే సమయంలో ప్రముఖులు సైతం భారీగా వచ్చి.. కరుణానిధి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.. దీంతో భద్రత కల్పించండం పోలీసులకు ఇబ్బందిగా మారింది..
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







