చిన్నారికి వైద్యం నిరాకరణ: డాక్టర్‌పై వేటు

- August 08, 2018 , by Maagulf
చిన్నారికి వైద్యం నిరాకరణ: డాక్టర్‌పై వేటు

మస్కట్‌: ఓ చిన్నారికి వైద్య చికిత్స నిరాకరించినందుకుగాను ఓ వైద్యుడిపై వేటు వేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. వైద్యుడు, సలాలాలోని సుల్తాన్‌ కబూస్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. సలాలా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్న మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వైద్యుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. చిత్తశుద్ధితో పనిచేయని వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మినిస్ట్రీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com