నేషనల్ డే ఈవెంట్స్‌కి సిద్ధమైన 'కటారా'
- December 15, 2015
కటారా - ది కల్చరల్ విలేజ్, ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా 43కి పైగా ఈవెంట్స్‌ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కటారాలో డిసెంబర్ 18, 19 తేదీల్లో ఈ ఈవెంట్స్ జరుగుతాయి. 18వ తేదీన మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, డిసెంబర్ 19న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈవెంట్స్ జరగనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ వెంట్స్‌లో ఎమిరి గార్డ్ నిర్వహించే మిలిటరీ పెరేడ్, కల్చరల్ ఈవెంట్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఖతారి సింగర్ మహమ్మద్ అల్ సై పేట్రియాటిక్ సాంగ్‌తో ఆహూతుల్ని అలరిస్తారు. ఖతారీ నేషనల్ డే ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ అబ్దుల్ రహ్మాన్ అల్ తమిమి మాట్లాడుతూ, ఈ ఈవెంట్స్‌కి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ అంతర్జాతీయ మ్యూజికల్ షో, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నిర్వహించే పారా జంపింగ్ షో మరియు ఫైర్ వర్క్స్ ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలు కతారా నేషనల్ డే ఈవెంట్స్‌లో ముఖ్యమైనవని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







