'జిడిఆర్ఎఫ్ఎ' 1 మిలియన్ ఇ-పోర్టల్ లావాదేవీలు
- December 15, 2015
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు పారినర్స్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ (జిఆర్డిఎఫ్ఎ) ఇ-పోర్టల్ ద్వారా 1 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి చెప్పారు. రెసిడెన్సీ ఇన్స్యూరెన్స్, వర్క్ పర్మిట్స్, విజిట్ వీసా వంటివన్నీ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందని జిడిఆర్ఎఫ్ఎ ప్రతినిథులు వెల్లడించారు. జిడిఆర్ఎఫ్ఎ కార్యాలయానికి వచ్చి, గంటల తరబడి వేచి చూసి పనులు పూర్తిచేసుకునేంత కష్టం ఇప్పుడు లేదనీ, ఇంట్లోంచి, కార్యాలయాల్లోంచి అవసరమైన పనులు పూర్తి చేసుకోగలుగుతున్నామనీ, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కార్యాలయానికి రావాల్సి వస్తుందని వినియోగదారులు చెప్పారు. ఇ-పోర్టల్‌తో ప్రభుత్వానికీ పని సులువయ్యిందనీ, అలాగే వినియోగదారులకూ మెరుగైన సేవల్ని అత్యంత వేగంగా అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఆన్లైన్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నామన్నారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







