ఆగష్టు 26న 'సంతోషం' అవార్డ్స్
- August 13, 2018
హైదరాబాద్:ప్రతి ఏడూ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సంతోషం అవార్డు వేడుక..ఈ ఏడాది కూడా సిద్ధం అయ్యింది. తెలుగు చిత్ర సీమలో ప్రతి ఏడూ ఎన్నో వందల చిత్రాలు విడుదల అవుతాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను రంజిపజేస్తాయి. అలాంటి చిత్రాలకు సంతోషం అవార్డ్స్ ఇచ్చి వాటిని సత్కరించడం ఆనవాయితీ. గత 15 సంవత్సరాలుగా ఈ అవార్డులును అందిస్తున్నది సంతోషం సంస్థ. ఈ ఏడాది జరగబోయేది 16 వ అవార్డుల వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
ఆగష్టు 26వ తేదీన జెఆర్సీ కన్వేషన్ హల్లో ఈ అవార్డుల వేడుక ను ఫిక్స్ చేసారు. టాలీవుడ్ సినిమా రంగానికి చెందిన అతిరధ మహారధులంతా ఈ వేడుకకు హాజరవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నది. క్రమం తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలకు హాజరయ్యేవారు. గతేడాది కొన్ని కారణాల వలన హాజరుకాలేకపోయారు. కానీ ఈ ఏడాది మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరు కాబోతున్నారట. ఒకవేళ ఇదే జరిగితే ఫంక్షన్ కు ఇంకాస్త కల రావడం ఖాయం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







