గుండెపోటుకు బార్లీ గింజలు తీసుకుంటే లాభాలు ...
- August 13, 2018బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ బార్లీ గింజలను ఆహారంలో ఎక్కువగా తీసుకోరు. ఈ బార్లీ గింజల్లోని పోషకాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం రక్తపోటు అదుపులో ఉంటుంది. బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువే. జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతాయి.
అంతేకాకుండా రక్తంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ కారణం వలనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఈ బార్లీ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెజబ్బులను, గుండెపోటును నివారిస్తాయి. బార్లీలోని విటమిన్ ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా ఉంచుతాయి.
ఈ గింజల్లోని ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు చర్మానికి, వెంట్రుకలకు మెరుపునిస్తాయి. ఈ గింజల్లోని విటమిన్ బి, సి వ్యాధి నిరోధకశక్తిని పెంచుటలో మంచిది సహాయపడుతాయి. బార్లీ గింజల్లోని ఐరన్ శాతం రక్తహీనతను నివారిస్తాయి. అంతేకాకుండా బార్లీలో ఉండే క్యాల్షియం, పాస్పరస్ ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు