మా ఇంట్లో దెయ్యం ఉంది: కలెక్టర్ ఆమ్రపాలి
- August 14, 2018
ట్రెండింగ్ దుస్తులలో.. గ్లామర్ కలెక్టర్ గా పేరున్న ఆమ్రపాలి వృత్రిపరంగా కూడా దూకుడుగానే ఉంటారని ప్రభుత్వవర్గాలలో పేరుంది. అయితే తన అధికారిక నివాసంలో దెయ్యం ఉందని.. అందుకే ఇంట్లోని ఒక గదిలో పడుకోలేనని చెప్పడం సంచలనంగా మారింది. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరంగల్ లోని తన అధికారిక నివాసానికి 133 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరగగా, దీనికి నిజాం నవాబు కాలంనాటి జార్జ్ పామర్ అనే ఇంజనీర్ దంపతులు శంకుస్థాపన చేసారని చెప్పారు. ఇంతుకు ముందు ఉన్న కలెక్టర్లు ఎవరు ఈ నివాసంలోని ఒక గదికి వెళ్లలేదని, తాను ఆగది తెరిచి పరిసరాలను చూశానని.. అయితే అందులో పడుకొనే సాహసం మాత్రం చేయనని అందులో దెయ్యం ఉందని చెప్పారు. ఏకంగా ఒక కలెక్టరే తన ఇంట్లో దెయ్యం ఉందని చెప్పడంతో ఇప్పుడు వీడియో తెగ ప్రచారం అవుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







