విజయవాడ:వ్యభిచారం పేరుతో ఆన్‌లైన్ మోసం
- August 15, 2018
విజయవాడ:పేరుతో ఆన్‌లైన్‌లో వల వేసి మగాళ్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. సోషల్ మీడియాలో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను ఛీట్ చేస్తున్నారు. ఇప్పటికి 5 అకౌంట్ల ద్వారా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. దాదాపు 20 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ ముఠా విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయడంతో.. స్నేహితుల ద్వారా బాధితురాలికి విషయం తెలిసింది. వెంటనే షాక్‌కి గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. గుంటూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళతోపాటు ఆమె అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా వీళ్లు ఈ తరహా దందా చేస్తున్నట్టు నిర్థారణ కావడంతో.. 420 సెక్షన్ కింద కేసు పెట్టడంతోపైటు, సైబర్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







