స్వేచ్ఛ

- August 15, 2018 , by Maagulf

హితులో

సన్నిహితులో
అయినవాళ్ళదగ్గర ఐదు నిముషాలైనా 
అచ్చంగా బతకలేని  స్వచ్ఛంగా  నిలువలేని నీడలు కొన్ని 
తల్లీ .. అని మొసలి కన్నీరు కార్చుతూ మట్టిని తడిపేస్తాయి  
ఏడాదికి ఒకటి రెండుసార్లు  కురిసే రెండు మూడు చినుకుల్లో 
నువ్వూ తడిసిపోతావు .
మూడు రంగుల్లో మురిసిపోతావు.

గాలికేం స్వేచ్ఛగానే  వీస్తున్నది  
అడ్డుగోడ లేని మేఘాలు  అందంగానే కదులుతున్నాయి 
ఆకాశంలో బొమ్మలను గీసుకుంటూ, మునుపటి లాగే

దేశమా ....నీకు తెలియనిదేముంది ! 
బతికినోళ్ళెందరో సచ్చిపోయారు 
సచ్చినోళ్ళు కొందరైనా బతికున్నారు 
ఉన్నోల్లే చస్తూ బతుకుతున్నారు.
అయినా...గాలికేం స్వేచ్ఛగానే  వీస్తున్నది .

పారువెల్ల
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com