ఒమన్ బీచ్ గోయర్స్‌కి జెల్లీ ఫిష్ వార్నింగ్
- August 15, 2018
మస్కట్: స్విమ్మర్స్, డైవర్స్ మరియు బీచ్ గోయర్స్‌కి జెల్లీ ఫిష్‌కి సంబంధించిన హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఒమన్ కోస్టల్ ఏరియాస్‌లో కన్పించే జెల్లీ ఫిష్ ప్రాణాంతకమైనది కాకపోయినా, స్కిన్ ఇరిటేషన్ వంటివి సంభవిస్తాయి. ఈ కారణంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, కొన్ని ప్రికాషన్స్‌ని అడ్వయిజ్ చేసింది. మెరైన్ సైన్స్ అండ్ ఫిషరీస్ సెంటర్ యాక్టింగ్ హెడ్ మొహమ్మద్ అల్ మషార్ఫి మాట్లాడుతూ, అల్ అష్కారా బీచ్, అల్ బుస్తాన్ మరియు కుర్రుమ్ బీచ్‌లలో కన్పిస్తుందనీ, కాస్తంత జాగ్రత్తగా వుంటే సరిపోతుందనీ, వీటి వల్ల ఎలాంటి ప్రాణాపాయం వుండదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మరాదనీ, జెల్లీ ఫిష్ విషపూరితం కాదని తెలిపింది మినిస్ట్రీ. ఒమన్ బీచ్‌లలో కన్పించే జెల్లీ ఫిష్, మనుషుల స్కిన్‌తో కాంటాక్ట్ అయితే ఇరిటేషన్‌తోపాటు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. జెల్లీ ఫిష్ వుండే బీచ్‌లలో స్విమ్మింగ్ చేయకపోవడమే మంచిదని పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







