బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్‌

- August 18, 2018 , by Maagulf
బహ్రెయిన్:ఐదేళ్ళలో కొత్త క్యాంపస్‌

బహ్రెయిన్:ఇసా టౌన్‌ నుంచి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ని తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనలు ప్రారంభించింది. 35 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. ఐదేళ్ళలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది. ఇసా టౌన్‌లో 32 ఏళ్ళ నుంచి ఇంజరీనింగ్‌ కాలేజ్‌ నడుస్తోంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో, పలు రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సఖిర్‌కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజ్‌ హెడ్‌ అబ్దుల్‌ బడెర్‌ ఖోన్జి మాట్లాడుతూ, పాత కాలేజీ భవనం గోడలు పాడయ్యాయనీ, వాటికి భారీ స్థాయిలో మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ చేయాల్సి వుంటుందని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com