ఐఎస్ఐఎస్పై దాడికి 34 దేశాలు
- December 16, 2015
ఐఎస్ఐఎస్కు మంగళం పాడేందుకు సర్వం సిద్ధమవుతోంది. పారిస్ ఘటన నేపథ్యంలో.. ఐసిస్‌పై దాడికి 34 దేశాలు కలిశాయి. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాల్లోని ముస్లింలపై అనుమాపు చూపులు పెరిగిపోతున్నాయి. ముస్లింలపై కొన్ని దేశాలు నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నాయి. 34 ముస్లిం దేశాలు కలిపి సంకీర్ణ సేనలను తయారు చేస్తున్నాయి. సౌదీ అరేబియా నేతృత్వంలో రియాద్ కేంద్రంగా సంకీర్ణ సేనలు ఐఎస్ విరుచుకుపడనున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేషియా, పాకిస్థాన్, గల్ఫ్ అరబ్, ఆఫ్రికన్ అరబ్ దేశాలున్నాయి. ఇస్లామిక్ దేశాలను ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం తమ విధి అని దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేయడం విధిగా ఆ దేశాలు పాటుపడుతున్నాయి. ఐఎస్‌పై చర్యలు అంతర్జాతీయ సమాజంతో సమన్వయం చేసుకుని తీసుకోవాల్సిన నిర్ణయమని దుబాయ్ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







