భారత్ దేశ రాజధాని లో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి ..

- December 16, 2015 , by Maagulf
భారత్ దేశ రాజధాని లో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి ..

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మార్చి 31 వరకు... 2వేల సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండి, డీజిల్‌తో నడిచే ఎస్‌యూవీలు, కార్లు, వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఈరోజు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు 2005కన్నా ముందే రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఢిల్లీలో ప్రవేశించే ట్రక్కులపై హరిత ట్యాక్స్‌ పెంచాలని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సరి, బేసి సంఖ్యల ఆధారంగా కార్లను అనుమతించే విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా నిజంగా కాలుష్యం తగ్గుతుందనిపిస్తే.. అమలు చేయాలని.. అందుకు తాము అభ్యంతరం చెప్పమని కోర్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com