భారత్ దేశ రాజధాని లో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి ..
- December 16, 2015
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మార్చి 31 వరకు... 2వేల సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, డీజిల్‌తో నడిచే ఎస్‌యూవీలు, కార్లు, వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఈరోజు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు 2005కన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఢిల్లీలో ప్రవేశించే ట్రక్కులపై హరిత ట్యాక్స్ పెంచాలని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సరి, బేసి సంఖ్యల ఆధారంగా కార్లను అనుమతించే విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా నిజంగా కాలుష్యం తగ్గుతుందనిపిస్తే.. అమలు చేయాలని.. అందుకు తాము అభ్యంతరం చెప్పమని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







