తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా 34 ఇస్లాం రాష్ట్రాలతో సంకీర్ణ సైనిక దళం

- December 16, 2015 , by Maagulf
తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా 34 ఇస్లాం రాష్ట్రాలతో సంకీర్ణ సైనిక దళం
తీవ్రవాదులపై పోరాటం చేసేందుకు 34 ఇస్లాం రాష్ట్రాలతో సంకీర్ణ సైనిక దళంను ఏర్పాటు చేస్తున్నట్లు  
   సౌదీ  విదేశాంగ మంత్రి ఆడెల్ అల్- జుబెఇర్ మంగళవారం ప్రకటించారు. తమ ప్రదాన లక్ష్యం ఏమిటంటే , 
  తీవ్రవాదులకు వ్యతిరేకంగా బాగస్వామ్య దేశాల మధ్య సమాచారాన్ని అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు.
  అవసరమైతే , ఇస్లాం స్టేట్ మరియు అల్ ఖైదా తీవ్రవాదులతో తలపడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. 
  అమెరికా, తీవ్రవాదులపై చేస్తున్న పోరాటానికి సౌదీ అరేబియా స్వాగాతిస్తున్నారని ఆయన తెలిపారు.     
  ఇరాక్ మరియు సిరియాలో భూబాగం  యొక్క స్వతేస్ ప్రాంతాల్లో తీవ్రవాదుల కదలికలు అధికంగా  
  వున్నాయని ఆయన అన్నారు. వరుస వెంబడి దాడులతో తీవ్రవాదులు గల్ఫ్ ప్రాంతంలోని రాజరిక 
  వ్యవస్థలను కూలదోసేందుకు పన్నాగాలను పన్నుతున్నారని అన్నారు. ఆ తీవ్రవాదులు షియా 
  ముస్లింలకు చెందిన మసీద్ లను పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నట్లు తమకు సమాచారం  
  తెలిసిందన్నారు. కువైట్ , సౌదీ అరేబియా భద్రతా దళాలపై దాడులు చేసి బెదిరించేందుకు సైతం 
  తీవ్రవాదులు వెనకాడటం లేదని వాపోయారు. ఖతర్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , టర్కీ , ఈజెప్ట్ ,
  మలేసియా, పాకస్తాన్ , ఆఫ్రికా దేశాలు , ఇప్పటకే  బోకోహరాం తీవ్రవాదులతో పోరాటం చేస్తున్న 
  నైజీరియా  దేశాలపై తీవ్రవాదులు దాడులకు పాల్పడితే సంకీర్ణ దళాల పోరాడుతాయన్నారు. తమ 
  జాబితాలో ఇరాన్ లేదని ఆయన ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చారు .
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com