హైదరాబాద్‌లో ముజ్రా పార్టీ..
- August 31, 2018
హైదరాబాద్‌కు మరో చెత్త సంస్కృతి దిగుమతి అవుతోంది. పాతబస్తీలో జూపార్క్ సమీపంలోని ఓ లాడ్జిలో ముజ్రా పార్టీ నిర్వహించారు. అదే పార్టీలో మద్యం సేవించి మత్తులోకి వెళ్లిన ఓ యువతిపై.. ఖుద్దూస్ అనే యువకుడు అత్యాచార యత్నం చేశాడు.
కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహించడం.. యువతిపై అత్యాచార యత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు లాడ్జిపై దాడులు చేశారు. ముగ్గురు యువతులు, ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు మైనర్లు ఉన్నారు.
హైదరాబాద్‌లో ఈమధ్య పెడధోరణులు పెరిగిపోతున్నాయి. పాష్ కల్చర్ పేరుతో నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు, సిటీలోని లాడ్జిల్లో ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అత్యాచార యత్నానికి పాల్పడడం పరాకాష్టగా భావిస్తున్నారు. మద్యం మత్తులోని మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన పాతబస్తీ అనుమానితుడు ఖుద్దూస్‌పై నిర్బయ చట్టం కింద కేసు పెట్టారు. మిగతా వారిపై కోప్టా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







