ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి..
- August 31, 2018
హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి చివరకు బ్రెయిన్ స్ట్రోక్‌కూ దారితీస్తున్నాయి. పక్షవాతం అంటే వయస్సు పైబడిన వారికే వస్తుందని గతంలో అనుకునేవారు. కానీ, ఇపుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యుక్తవయసు వారికీ వస్తోంది. అంతేనా, మానసిక, పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యంబారిన పడుతున్నారు. ఒత్తిడి జయించి, బ్రెయిన్ స్ట్రోక్‌కు దూరంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
* రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు.
* రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి.
* మానసిక ఒత్తిడికిగురయ్యే పనులకు దూరంగా ఉండాలి.
* ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు.
* కూర్చుని పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
* కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి.
* నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.
* తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి.
* రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* అధిక బరువు, హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వుపదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







