రేపటి నుంచి అమెరికాలో 'మహర్షి' షూటింగ్..
- September 01, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు 25వ సినిమాగా ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వస్తున్నారు. తదుపరి షెడ్యూల్ ను అమెరికా .. న్యూయార్క్ .. కాలిఫోర్నియా .. లాస్ వెగాస్ లలో ప్లాన్ చేశారు. రేపటి నుంచి షూటింగ్ అక్కడ జరగనుంది. 2 నెలల పాటు ఏకధాటిగా అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను, నాయకా నాయికలపై రొమాంటిక్ సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అశ్వనీదత్, దిల్ రాజు, పి వి పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను, 'ఉగాది' కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







