300పైగా విదేశీయులను అరెస్టు చేసిన అమెరికా అధికారులు
- August 31, 2018
న్యూయార్క్: ఆరు రాష్ట్రాలలో నేర కార్యాకలాపాలకు, ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై 300 మందికి పైగా విదేశీయులను అమెరికా అధికారుల అరెస్టు చేయగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఇండియానా, ఇల్లినాయిస్, కాన్సాస్, కెంటుకీ, మిస్సోరి, విస్కాన్సిన్ అంతటా చర్యల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో విదేశీ నేరస్థులు , ఇమ్మిగ్రేషన్ను ఉల్లంఘన కింద 364 మందిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసిఇ), ఫెడరల్ అధికారులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా 25 దేశాలకు చెందిన వారు అరెస్టు కాగా, ఆరుగురు భారతీయులు ఉన్నారు. కొలంబియా, చెక్ రిపబ్లిక్, ఈక్వెడార్, జర్మనీ, ఇతర దేశస్తులు వున్నారు. అరెస్టైన 364 మంది 187 మందిపై నేరారోపణలు జరిగాయి. వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు. ఇల్లినాయిస్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడటంతో భారత్కు చెందిన వ్యక్తిని అరెస్టుచేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







